తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో వ్యక్తి మృతి.. మానవత్వం చాటుకున్న ముస్లింలు - Muslims who conducted funerals for Hindu man died with corona

కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులు, గ్రామస్థులు ముందుకురాలేదు. కుటుంబ సభ్యుల బాధను అర్థం చేసుకున్న ముస్లిం సోదరులు దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించారు.

muslims conducted funerals for hindu
కరోనాతో వ్యక్తి మృతి.. మానవత్వం చాటుకున్న ముస్లింలు

By

Published : May 22, 2021, 9:53 AM IST

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి కృష్ణ(55)కు గత కొంతకాలం క్రితం కరోనా సోకింది. హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తీసుకురాగా అంత్యక్రియలు చేసేందుకు ... బంధువులు, గ్రామస్థులు ముందుకు రాలేదు.

గ్రామానికి చెందిన ముస్లిం యువకులు మృతదేహాన్ని ఖననం చేయడానికి ముందుకు వచ్చారు. ముస్లింలు అయినప్పటికీ హిందూ సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించారు. మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details