తెలంగాణ

telangana

ETV Bharat / state

జీతం కోసం పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - kamareddy district latest news

జీతాల బకాయిలు చెల్లించాలంటూ కామారెడ్డి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. విలీన గ్రామాల కార్మికులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని... తక్షణమే పెండింగ్​ జీతాలు ఇప్పించాలని డిమాండ్​ చేశారు.

municipal workers protest in kamareddy
జీతం కోసం పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

By

Published : Mar 17, 2020, 5:14 PM IST

కామారెడ్డి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. పెండింగ్​ వేతనాలు ఇప్పించాలంటూ ఇవాళ ఉదయం నుంచి పనులు విరమించి ధర్నాకు దిగారు. విలీన గ్రామాల కార్మికులకు గత 2 నెలలగా జీతాలు రావడంలేదని వాపోయారు.

జీతమిచ్చేవరకు పనికిపోం...

నీటి సరఫరా కార్మికులకు ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలని కోరారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు, అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించినా... సెలవన్నదే లేకుండా పనిచేస్తున్న తమకు కనీసం జీతం ఇవ్వకపోవడం దారుణమని వాపోయారు. పెండింగ్​ జీతాలు మంజూరు చేసేవరకు విధులకు హాజరయ్యేది లేదని స్పష్టంచేశారు.

జీతం కోసం పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details