తెలంగాణ

telangana

ETV Bharat / state

క్షమాపణ చెప్పాలంటూ ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో ధర్నా - mrps leaders protest for sorry at tippapur

వాట్సాప్​ గ్రూపులో డీపీ కోసం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా తమకు క్షమాపణ చెప్పాలని కోరుతూ కామారెడ్డి జిల్లా భిక్నూర్​ మండలం తిప్పాపూర్​లో ఎమ్మార్పీఎస్​ నాయకులు, కొందరు యవకులు కలిసి ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి బాధ్యులపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వగా పరిస్థితి సద్దుమణిగింది.

mrps leaders protest for sorry at tippapur
తమకు క్షమాపణ చెప్పాలంటూ ఎమ్మార్పీఎస్​ నాయకుల ధర్నా

By

Published : Jun 22, 2020, 9:26 AM IST

కామారెడ్డి జిల్లా భిక్నూర్​ మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మార్పీఎస్​ నాయకులు రహదారిపైన బైఠాయించి నిరసన తెలిపారు. మండలంలోని తిప్పాపూర్​ గ్రామానికి చెందిన కొందరు యువకులు వాట్సాప్​ గ్రూపులో ఒక వర్గానికి చెందిన కొందరు అంబేడ్కర్​ ఫోటోను డీపీగా పెట్టాలని కోరగా.. అందుకు మిగతావారు నిరాకరించారు. దీనివల్ల వారి మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దిగగా.. తమకు క్షమాపణ చెప్పాలని ఎస్సీ, ఎస్టీ వర్గం వారు కోరారు.

అందుకు వారు నిరాకరించగా ఎమ్మార్పీఎస్​ నాయకులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. జరిగిన విషయం తెలుసుకుని బాధ్యులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:చైనాను ఆర్థికంగా దెబ్బతీసేలా కేంద్రం పావులు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details