కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట్ గ్రామం శివారులోని భీమేశ్వరాలయం పరిసర ప్రాంతాల్లో నూతన సినిమా షూటింగ్ జరుగుతోంది. 'ఐశ్వర్యతో అభిరామ్' చిత్రీకరణ జరుగుతుండటంతో నటీనటులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. ఆలయ పరిసరాలు, చుట్టుపక్కల గుట్టలు, చెట్లు ఉండడంతో చిత్రీకరణ చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
భీమేశ్వరాలయం పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ - ఐశ్వర్యతో అభిరామ్ చిత్రీకరణ
తాడ్వాయి మండలంలోని భీమేశ్వరాలయం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సినిమా షూటింగ్ చూసేందుకు చుట్టు పక్క గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలొచ్చారు. ఆలయ పరిసరాలు బాగున్నాయని... చిత్రీకరణకు అనువుగా ఉండటంతో షూటింగ్ చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
![భీమేశ్వరాలయం పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ movie-shooting-at-tadwai-mandal-kamareddy-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10648932-thumbnail-3x2-shooting.jpg)
భీమేశ్వరాలయం పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ