కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో బద్దం లక్ష్మారెడ్డి, లింగమణి నివాసముంటున్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు రణదీప్, కూతురు శిరీష. చాలా సంతోషంగా ఉంటూ సమాజంలో చాలా కలివిడిగా ఉండే కుటుంబం అది.
ఈరోజు కూడా తల్లి, తండ్రి, కూతురు పనిచేసుకునేందుకు పొలానికి వెళ్లారు. ఉదయం 10 ప్రాంతంలో భర్తను నీళ్లు తీసుకురమ్మని లింగమణి చెప్పింది. అతను వెళ్లి వచ్చేలోపు శిరీష, లింగమణి ఒకే చున్నీని నడుంకి బిగించుకుని వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. లక్ష్మారెడ్డి వచ్చేసరికి వారు నీటమునిగి పోయారు.