అయినవారు చనిపోతేనే పట్టించుకోని నేటి సమాజంలో వానరానికి శాస్త్రోకంగా అంత్యక్రియలు నిర్వహించి ఆ గ్రామస్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. హనుమంతుని ప్రతిమగా భావించే వానరానికి కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పోల్కంపేట్ గ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
మానవత్వం: వానరానికి అంత్యక్రియలు - కామారెడ్డి జిల్లా లేటెస్ట్ న్యూస్
పక్కనున్న మనిషి చనిపోతేనే పట్టించుకోని నేటి కాలంలో... ఓ వానరానికి అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్నారు ఆ గ్రామస్థులు. హనుమంతుని ప్రతిమగా భావించే వానరానికి శాస్త్రోకంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

మానవత్వం: వానరానికి అంత్యక్రియలు
ప్రమాదవశాత్తు మృతి చెందిన ఓ వానరానికి సర్పంచ్ పద్మ, ఉప సర్పంచ్ రామానుజాచారి, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు రమేష్, నాగరాజులు ఆ నలుగురిగా మారారు. వీరి మానవత్వాన్ని చుట్టు పక్కల గ్రామాల వారు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి:అతి వేగం.. బతుకులు ఆగం..