తెలంగాణ

telangana

ETV Bharat / state

'5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని... రెండేళ్లయినా పత్తా లేదు'

నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి విమర్శలు చేయని ఎమ్మెల్సీ కవిత మొదటి సారిగా అర్వింద్​పై మండిపడ్డారు. భారత్​బంద్​లో భాగంగా కామారెడ్డిలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న కవిత.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర బిల్లులను వెనక్కి తీసుకునేలా చేయాలని సూచించారు.

mlc kavitha allegations on mp arvindh
mlc kavitha allegations on mp arvindh

By

Published : Dec 8, 2020, 9:39 PM IST

'5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని... రెండేళ్లయినా పత్తా లేదు'

కామారెడ్డి పట్టణ శివారులోని టెక్రియాల్ వద్ద జరిగిన ధర్నా సందర్భంగా ఎంపీ అర్వింద్​పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి.. రెండేళ్లయినా పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు పేరు చెప్పి ఓట్లేయించుకుని మోసం చేశారని విమర్శించారు.

ఇప్పుడు మూడు బిల్లులు తెచ్చి రైతులకు మంచి జరుగుతుందని చెప్తే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రోడ్డుపై బైఠాయించి ధర్నాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకుని గుర్తు చేసిన కవిత... ఇప్పుడు కూడా కేంద్ర బిల్లులను రద్దు చెపించేందుకు దేశమంతా ఒక్కటైందన్నారు. ఉద్యమ స్ఫూర్తితో కేంద్రం తెచ్చిన చట్టాలు వెనక్కి తీసుకునే వరకు పోరాడాలని సూచించారు.

ఇదీ చూడండి: 'అన్నదాతలను అందలం ఎక్కించేందుకే.. కొత్త చట్టాలు'

ABOUT THE AUTHOR

...view details