పత్తి రైతులు నష్ట పోకుండా ఉండేందుకే సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పునఃప్రారంభించామని ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. రైతులు తీసుకొచ్చిన పత్తిని పరిశీలించారు.
సీసీఐ కొనుగోలు కేంద్రాల పునఃప్రారంభం - kamareddy news
కామారెడ్డి జిల్లా మద్నూర్ పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హన్మంత్ షిండే సందర్శించారు. రైతులు తీసుకొచ్చిన పత్తిని పరిశీలించారు.
![సీసీఐ కొనుగోలు కేంద్రాల పునఃప్రారంభం mla visited cci purchase center in madnooru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7183865-916-7183865-1589376287161.jpg)
సీసీఐ కొనుగోలు కేంద్రాల పునఃప్రారంభం
లాక్డౌన్ కారణంగా ఇన్ని రోజులు కొనుగోలు కేంద్రం మూసి ఉంచారని... రైతుల వద్ద ఇంకా మిగిలిపోయిన పత్తి ఉన్నందున వారికి నష్టం జరగకుండా మళ్లీ ప్రారంభించామన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు.