దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను ప్రవేశపెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని ఆయకట్టుకు పోచారం జలాశయం నీళ్లను విడుదల చేశారు.
పోచారం జలాశయం నీటి విడుదల - ఎమ్మెల్యే సురేెందర్ తాజా పర్యటన
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయం నీటిని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే సురేందర్ విడుదల చేశారు. జలాశయం పరిధిలోని సుమారు 12 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు.
![పోచారం జలాశయం నీటి విడుదల mla surender release pocharam reservoir water in kamareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10080724-993-10080724-1609491455187.jpg)
పోచారం జలాశయం నీటి విడుదల
జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలకు వర ప్రదాయినిగా పేరొందిన పోచారం జలాశయం నీళ్లను రబీ సీజన్లో ఏ, బీ జోన్లుగా విభజించి ఏడాదికి ఒక్క జోన్కు మాత్రమే నీటిని విడుదల చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సీజన్లో ఏ జోన్లో భాగమైన నాగిరెడ్డిపేట మండలంలోని 7 వేల ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 5 వేల ఎకరాలకు పరోక్షంగా నీళ్లందిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :ప్రియుడి ఘనకార్యం- ప్రియురాలి ఇంటికి సొరంగం