కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు ఎమ్మెల్యే జాజాల సురేందర్. నియోజకవర్గంలోని పన్నెండు వందల మంది ఆటోలపైనే జీవనం సాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారికి గ్రామాల వారీగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తామని తెలిపారు.
ఆటో చోదకులకు నిత్యావసర సరుకులు అందజేసిన ఎమ్మెల్యే - MLA JAJALA SURENDER LATEST NEWS
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆటో చోదకులకు నిత్యావసర సరుకులు అందజేశారు.

ఆటో చోదకులకు నిత్యావసర సరుకుల అందజేసిన ఎమ్మెల్యే
అలాగే టాక్సీలను నడిపించే డ్రైవర్లకు కూడా త్వరగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. లాక్డౌన్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే సురేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మార్క్ ఫెడ్ ఛైర్మన్ గంగారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ సత్యనారాయణ తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఈటీవీ భారత్ ఎఫెక్ట్: వృద్ధురాలికి ఎమ్మెల్యే సాయం