తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ శాఖల మధ్య సమన్వయలోపం.. ప్రజల పాలిట శాపం' - mla hanmanth shinde

అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయలోపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడపగల్​లో అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు, కలెక్టర్​తో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.

jukkal, jukkal mla, jukkal mla hanmanth shinde
జుక్కల్, జుక్కల్ ఎమ్మెల్యే, హన్మంత్ షిండే

By

Published : Apr 2, 2021, 1:05 PM IST

అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయ లోపంతో పట్టాలు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. అటవీ, రెవెన్యూ భూములున్నా.. కొందరు ఇప్పటి వరకు పట్టాలు రాలేదని తెలిపారు.

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడపగల్​లో అటవీ, రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్​తో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. అటవీ, రెవెన్యూ శాఖల వారీగా పెండింగ్​లో ఉన్న భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంసాగర్​ మండలానికి రానున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్లి ప్రజల సమస్య పరిష్కరిస్తానని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details