ఉద్యోగాల కోసం దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కేవీఎస్ ఫంక్షన్ హాల్లో ఆర్మీ, పోలీసు ఉద్యోగాలపై జిల్లా ఎస్పీ శ్వేతతో కలిసి అవగాహనా కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.
'ఉద్యోగాల కోసం దళారులను నమ్మి మోసపోకండి' - పోలీసు, ఆర్మీ ఉద్యోగాల కోసం అవగాహన కార్యక్రమం
రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరుగుతుందని కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గంప గోవర్థన్ అన్నారు. ఈ మేరకు ఎస్పీ శ్వేతతో కలిసి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో అవగాహనా కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.
'ఉద్యోగాల కోసం దళారులను నమ్మి మోసపోకండి'
దేశ భవిష్యత్ యువత చేతిలో ఉందని ఎమ్మెల్యే గంప గోవర్థన్ అన్నారు. దేశ రక్షణ కోసం యువతీయువకులు ఆర్మీ, పోలీసు ఉద్యోగాలల్లో చేరాలని ఆయన కోరారు. ఉద్యోగాల విషయంలో ఉన్న అపోహలను ఎమ్మెల్యే తొలంగించారు. ఉద్యోగ నియామక ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరుగుతుందని, దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ కల్నల్ శ్రీనివాసరావు పాల్గొని పలు సూచనలు చేశారు.
ఇదీ చదవండి:బెంగళూరులో ఐసిస్ ముష్కరుడి ఆనవాళ్లు