కరోనా విపత్కాలంలో పేదలకు అండగా ఉండాలని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సూచించారు. నియోజకవర్గంలోని పేదలను గుర్తించి వారికి గత పది రోజులుగా నిత్యావసర సరకులు అందిస్తున్నారు. అందులో భాగంగా గురువారం ఆయన సొంత గ్రామమైన భిక్నూర్ మండలం బస్వాపూర్‌లో పేద ప్రజలకు నిత్యావసర సరకులు అందించారు.
పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంప గోవర్ధన్ - పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
లాక్డౌన్ ప్రారంభం నుంచి ఉపాధి లేక గ్రామాల్లోని పేద ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు స్పందించి పేదలకు సాయం చేయాలని సూచించారు. భిక్నూర్ మండలం బస్వాపూర్‌లో పేద ప్రజలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
పేదలకు నావంతు సాయం చేస్తున్నా: ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కష్టకాలంలో తన వంతు సాయం చేస్తున్నానని.... అందరూ స్పందించి పేదలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలెవ్వరూ గుంపులు గుంపులుగా రావొద్దని... భౌతిక దూరం పాటిస్తూ కరోనా నుంచి రక్షణ పొందాలని తెలిపారు.
ఇదీ చూడండి:ఒకే కుటుంబంలో 8 మందికి కరోనా పాజిటివ్