ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టింది. క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహంచడంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. అధికారుల పర్యవేక్షణ కరువై పైపులు పగిలి నీరు వృథాగా పోతున్న సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచమర్రి సమీపంలో జరిగింది.
మిషన్ భగీరథ పైపులు పగిలి వృథాగా పోతున్న నీరు - కామారెడ్డి తాాజా సమాచారం
రాష్ట్రప్రభుత్వ ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకంలో నిర్వహణ కరువైంది. స్వచ్ఛమైన తాగునీరందించే పైపులు పగిలి నీరు వృథాగా పోతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచమర్రి సమీపంలో పైపుల ద్వారా నీళ్లు విరజిమ్ముతున్నాయి.
మిషన్ భగీరథ పైపులు పగిలి వృథాగా పోతున్న నీరు
రెండు వేర్వేరు ప్రదేశాల్లో పైపులైన్ పగిలి రహదారిపైనే నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రతిష్టాత్మకమైన పథకంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.