మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఆస్పత్రి నిర్మించామని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో పర్యటించిన ఆయన.. రూ. 5 కోట్లతో స్థానికంగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవనాన్ని ఎమ్మెల్యే హనుమంతు షిండేతో కలసి ప్రారంభించారు.
మారుమూల పల్లెలకు వైద్యం అందాలి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి - minister vemula visited jukkal mandal
కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటించారు. రూ. 5 కోట్లతో నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు.
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జుక్కల్
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ శోభ, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.