తెలంగాణ

telangana

ETV Bharat / state

నియంత్రిత సాగు.. లాభదాయకమైన సాగు: మంత్రి వేముల - కామారెడ్డి జిల్లా తాజా వార్తలు

నియంత్రిత సాగు... లాభదాయకమైన సాగు అని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్​లోకి మల్లన్న సాగర్ నుంచి ఐదు వేల క్యూసెక్కుల నీళ్లు తెప్పిస్తామని హామీ ఇచ్చారు. 18 కిలోమీటర్ల సొరంగ మార్గం పనులు జరుగుతున్నాయన్నారు. అది పూర్తి కాగానే నిజాంసాగర్​లోకి నీళ్ళు వస్తాయన్నారు.

నియంత్రిత సాగు.. లాభదాయకమైన సాగు: మంత్రి వేముల
నియంత్రిత సాగు.. లాభదాయకమైన సాగు: మంత్రి వేముల

By

Published : May 30, 2020, 10:20 PM IST

నియంత్రిత సాగు.. లాభదాయకమైన సాగు అని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో వానాకాలం సాగు ప్రణాళికపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు ఎమ్మెల్యే హనుమంత్ షిండే వివరించారు. దానికి సానుకూలంగా మంత్రి స్పందించారు.

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మల్లన్న సాగర్ నుంచి ఐదు వేల క్యూసెక్కుల నీళ్లు తెప్పిస్తామని మంత్రి వేముల హామీ ఇచ్చారు. 18 కిలోమీటర్ల సొరంగ మార్గం పనులు జరుగుతున్నాయన్నారు. అది పూర్తి కాగానే నిజాంసాగర్​లోకి నీళ్ళు వస్తాయన్నారు. జుక్కల్, మద్నూర్ మండలాల్లో రోడ్డు సమస్యలు, అవసరం ఉన్న చోట జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది కొరతను త్వరలో పరిష్కరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

"ఇదేదో నియంత్రిత వ్యవసాయం కాదు. లాభసాటి వ్యవసాయ విధానం. ఎవరిని బలవంతం పెట్టేది కాదు. బలవంతం చేస్తే పనులు జరుగుతాయా? మనం వేసే పంటలకు మంచి మార్కెట్​ ధర రావాలే..? ఇదే మన చర్చ. మన పంటల్లో, మన నేలల్లో.. మనకు అలవాటు ఉన్న పంటల్లోనే ఏవి కొద్దిగా ఎక్కువ వేయాలి.. ఏవి కొద్దిగా తక్కువ వేయాలని తెలుసుకోవడం."

- వేముల ప్రశాంత్​ రెడ్డి, మంత్రి

నియంత్రిత సాగు.. లాభదాయకమైన సాగు: మంత్రి వేముల

ఇవీ చూడండి: జూన్​ 30 వరకు లాక్​డౌన్ 5.0-​ కీలక మార్గదర్శకాలు ఇవే

ABOUT THE AUTHOR

...view details