తెలంగాణ

telangana

ETV Bharat / state

దూరదృష్టితో ఒకేచోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు: మంత్రి వేముల

పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్​, ఎస్పీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. నూతన జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఏర్పాటు చేసేలా సీఎం దూరదృష్టితో ఆలోచించారన్నారు.

dgp mahendar reddy, minister vemula prashanth reddy
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి

By

Published : Jun 6, 2021, 9:33 AM IST

పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నూతన జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఏర్పాటు చేసేలా సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించారన్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఈ నెల 10 నుంచి 15 లోపు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఆయా కార్యాలయాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల ఫిర్యాదు కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వయంగా ఎస్పీ వచ్చి సమస్యలు పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారన్నారు. కొత్త జిల్లాల్లో హెడ్​క్వార్టర్స్ సహా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ మాదిరిగా రూపకల్పన చేశారని.. నిర్మాణాలకు కావాల్సిన నిధులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమకూర్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ శరత్, వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర, డీఐజీ శివ శంకర్ రెడ్డి, ఎస్పీ శ్వేతారెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:మానింది మందు... బతికింది ఊరు

ABOUT THE AUTHOR

...view details