కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెదలో వెలుగు చూసిన 2,200 ఏళ్ల నాటి బ్రాహ్మి శాసనంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తక్షణమే రాష్ట్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారుల బృందం... శాసనాలు లభించిన ప్రదేశాన్ని సందర్శించి సమగ్రమైన నివేదికను వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. ఆ ప్రదేశంలో ఇంకా ఏమైనా రాతి యుగపు ఆనవాళ్లు, చారిత్రక ఆధారాలు ఉంటే వాటిని వెంటనే భద్రపరచాలని సూచించారు.
బ్రాహ్మి శాసనంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందన - mall thummeda brahmi legislation
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెదలో వెలుగు చూసిన 2,200 ఏళ్ల నాటి బ్రాహ్మి శాసనంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. శాసనాలు లభించిన ప్రదేశాన్ని సందర్శించి సమగ్రమైన నివేదికను వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఎంతో ప్రాచీన చరిత్ర ఉందన్న మంత్రి... సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై పలు పరిశోధనలు జరుపుతున్నామని మంత్రి అన్నారు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటి "అశోక బ్రహ్మి లిపి" లో ప్రాకృత భాషలో 5 అక్షరాలున్న 'మాధవ చంద' అని ఓ వ్యక్తి పేరు రాసిన లఘు శాసనం తొలి శాతవాహనుల కాలం నాటిదని చరిత్ర కారులు వెల్లడించారన్నారు. ఈ శాసనం తెలంగాణకు సంబంధించిన వాటిలో ఇదే పురాతనమైనదన్నారు.
శాతవాహనుల కాలం నాటి పురావస్తు స్థలాలు కోటి లింగాల, ధూళికట్ట వంటి దొరికిన శాసనాల కాలం కంటే ఇదే పురాతనమైనదన్నారు. మంత్రి పురావస్తు నిపుణులను, కన్సల్టెంట్, పురావస్తు అన్వేషకులు ఎంఏ శ్రీనివాస్, భానుమూర్తి, శంకర్ రెడ్డి లకు అభినందనలు తెలియజేశారు.