రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నందువల్ల అధికారులు వైరస్ వ్యాప్తిని నియంత్రించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కొవిడ్ రెండో దశ వ్యాప్తి , టీకా పంపిణీపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో ఫోన్లో మాట్లాడారు.
వ్యాక్సిన్ పంపిణీపై కలెక్టర్లతో ఫోన్లో చర్చించిన మంత్రి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రుల్లో వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు అన్ని సౌకర్యాలను కల్పించాలని అధికారులను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. కొవిడ్ వ్యాప్తిని నిరోధించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వైరస్ వ్యాప్తి, టీకా పంపిణీ మొదలైన అంశాలపై అధికారులతో ఫోన్లో చర్చించారు.
వ్యాక్సినేషన్ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రుల్లో వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు అన్ని సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. ఏ పేషంట్‌కు ఎక్కడ చికిత్స అందించాలో ఒక ప్రోటోకాల్‌ను రూపొందించాలని సూచించారు. ప్రజలు కూడా విధిగా మాస్క్ ధరించాలని కోరారు.
ఇదీ చదవండి:సాగర్ ఉపఎన్నికలో కోవర్టులపైనే పార్టీల ప్రత్యేక దృష్టి