తెలంగాణ

telangana

ETV Bharat / state

'నూతన వ్యవసాయ బిల్లుతో రైతులకు తీవ్ర అన్యాయం' - ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా పరిషత్ సర్వసభ సమావేశంలో కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్​రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ్యులు మద్దతు తెలిపారు. నూతన వ్యవసాయ బిల్లులు... రైతుల నడ్డివిరిచేలా ఉన్నాయని మంత్రి తెలిపారు.

సర్వసభ్య సమావేశంలో కేంద్ర వ్యవసాయ బిల్లుపై వ్యతిరేక తీర్మానం
సర్వసభ్య సమావేశంలో కేంద్ర వ్యవసాయ బిల్లుపై వ్యతిరేక తీర్మానం

By

Published : Oct 15, 2020, 8:17 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా పరిషత్ సర్వసభ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను, విద్యుత్​పై తీసుకురాబోతున్న నూతన బిల్లులకు వ్యతిరేకంగా సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. అందరూ సమర్థిస్తూ ఏకగ్రీవంగా బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులు... రైతుల నడ్డివిరిచేలా ఉన్నాయని మంత్రి ఆరోపించారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రైవేట్​పరం చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని... అందుకే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. విద్యుత్ బిల్లులు సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందికి గురిచేసేలా ఉన్నాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి.. విషాదంలో కుటుంబీకులు

ABOUT THE AUTHOR

...view details