తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish Rao Visits Kamareddy: 'ప్రభుత్వానికి, ప్రజల మధ్య ఆశాలు ఆరోగ్య వారధులు'

Harish Rao Visits Kamareddy: కామారెడ్డి జిల్లాలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉందని.. ఆశావర్కర్లు గర్భిణీల్లో అవగాహన పెంచాలని మంత్రి హరీశ్​ రావు సూచించారు. ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా ఆశావర్కర్లు.. సర్కారుకు ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డిలో ఆశావర్కర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.

'ప్రభుత్వానికి, ప్రజల మధ్య ఆశాలు ఆరోగ్య వారధులు'
'ప్రభుత్వానికి, ప్రజల మధ్య ఆశాలు ఆరోగ్య వారధులు'

By

Published : Feb 13, 2022, 6:54 PM IST

Harish Rao Visits Kamareddy: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆశావర్కర్లకు ప్రభుత్వం అండగా ఉంటోందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా ఆశావర్కర్లు.. సర్కారుకు ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉందని.. ఆశావర్కర్లు గర్భిణీల్లో అవగాహన పెంచాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్ రావు... స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి.. నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి పనులను పర్యవేక్షించారు. కలెక్టరేట్​లో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. కామారెడ్డిలో ఆశావర్కర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

కామారెడ్డి నుంచే..

రాష్ట్రంలోని 27వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్​లు, 4జీ సిమ్​లు అందించే కార్యక్రమం కామారెడ్డి నుంచి ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఆశావర్కర్లకు తెలంగాణలో ఇస్తున్న జీతం.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదని చెప్పారు. తెలంగాణలో రూ.9750 ఇస్తుంటే.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్​లో రూ.4వేలు మాత్రమేనని చెప్పారు. ప్రతి నెల ఒకటో తేదీన ఆశాలకు జీతాలు అకౌంట్​లో వేస్తున్నామని తెలిపారు. ప్రజారోగ్యంలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంటే.. మోదీ ఎంపీగా ఉన్న ఉత్తర్​ప్రదేశ్ చిట్టచివరి స్థానంలో ఉందన్నారు. కరోనా సమయంలో, ఇటీవల ఫీవర్ సర్వేలో ఆశాలు అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు. సాధారణ ప్రసవాలు పెరిగేలా ఆశాలు మరింత కృషి చేయాలని సూచించారు.

22 మాతా శిశు సంరక్షణ ఆస్పత్రులు

రాష్ట్రంలో రూ.407 కోట్లతో 22 మాతా శిశు సంరక్షణ ఆస్పత్రులు నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 61 మార్చురీల మరమ్మతులకు రూ.32.5కోట్లు మంజూరు చేశామన్నారు. సమావేశంలో మంత్రితో పాటు ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు సురేందర్, హన్మంత్ షిండే, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కలెక్టర్ జితేష్ పాటిల్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు

గర్భిణీలకు అవగాహన కల్పించాలి..

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆశావర్కర్లను సోదరీమణుల్లా భావించి వారి వేతనాలను పెంచారు. తెలంగాణ వచ్చిన నాడు రూ.1500 ఉంటే ఇవాళ రూ.9750కు పెంచుకున్నాం. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్​లో రూ.4000 వేలు అయితే.. మధ్యప్రదేశ్​లో రూ.3వేలు.. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్​లో కూడా 3వేలే ఇస్తున్నారు. ఆశావర్కర్ల పనిని ప్రభుత్వం గుర్తించింది. అందుకే స్మార్ట్​ఫోన్​తో పాటు 4జీ సిమ్​ను అందించాం. కామారెడ్డి జిల్లాలో ఎనీమియా 78శాతం ఉంది. గర్భిణీలకు ఔషధాలు ఇవ్వడమే కాకుండా వాళ్లు వేసుకునేలా ఆశాకార్యకర్తలు చర్యలు తీసుకోవాలి.పీహెచ్‌సీ వైద్యులు కూడా గర్భిణీలకు అవగాహన కల్పించాలి. పీహెచ్‌సీ పరిధిలో ఉండే వైద్యులు గర్భిణీలకు ఫోన్‌ చేసి చెప్పాలి. అన్ని ఆస్పత్రుల్లోనూ రక్తహీనతను తగ్గించే ఇంజెక్షన్లు ఉన్నాయి.

-హరీశ్​ రావు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి

'ప్రభుత్వానికి, ప్రజల మధ్య ఆశాలు ఆరోగ్య వారధులు'

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details