తెలంగాణ

telangana

ETV Bharat / state

తాడ్వాయి గ్రామస్థులపై మంత్రి ఎర్రబెల్లి అసంతృప్తి - కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో పారిశుద్ద్య నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల అధికారులు, గ్రామస్థులపైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ERRABELLI FIRES ON VILLAGERS
తాడ్వాయి గ్రామస్థులపై మంత్రి ఎర్రబెల్లి అసంతృప్తి

By

Published : Jan 7, 2020, 12:19 PM IST

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలో గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లోకి వెళ్లి ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు చేశారు.

ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తుండటంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా పంచాయతీ అధికారిని పిలిచి.. ప్లాస్టిక్ వాడుతున్నవారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు. అలాగే మండల కేంద్రంలో పరిసరాలు పరిశీలించారు. పారిశుద్ద్య నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల అధికారులు, గ్రామస్థులపైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.

తాడ్వాయి గ్రామస్థులపై మంత్రి ఎర్రబెల్లి అసంతృప్తి

ఇవీ చూడండి: బాలికపై ఇంట్లోనే అత్యాచారయత్నం...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details