కరోనా నేపథ్యంలో వినాయక చవితి పండగ నిర్వహించాలా వద్దా అనే సందేహం అందరిలో నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో వినాయక విగ్రహాల ప్రతిష్ఠను నిషేధిస్తూ తీర్మానం చేశారు. గ్రామస్థులంతా ఒకచోట చేరి సమష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
'ఎవరి ఇళ్లల్లో వారే పండుగ చేసుకోవాలి.. గ్రామంలో మండపాలు నిషేధం'
కామారెడ్డి జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండడం వల్ల గ్రామాల్లో ఆందోళనలు నెలకొంటుంది. వినాయక చవితి పండుగ చేసుకోవాలా వద్దా అనేదానిపై తీవ్రస్థాయిలో చర్చ కొనసాగుతోంది. కాగా తలమడ్ల గ్రామంలో ఒక్క మండపం కూడా ఏర్పాటు చేయొద్దని.. మట్టి విగ్రహాలను ఇంట్లోనే ఏర్పాటు చేసుకుని పూజించుకోవాలని గ్రామస్థులంతా తీర్మానించుకున్నారు.
'ఎవరి ఇళ్లల్లో వారే పండుగ చేసుకోవాలి.. గ్రామంలో మండపాలు నిషేదం'
గ్రామంలో ఒక్క మండపం కూడా ఏర్పాటు చేయవద్దని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రతి ఇంట్లో మట్టి విగ్రహాలు మాత్రమే ప్రతిష్ఠించుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని నిర్ణయించారు. కరోనా మహమ్మారి తీవ్రత దృశ్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని సర్పంచ్ యాదవ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇవీచూడండి:భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్