తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరకట్నం కోసం వేధించారు... చివరకు చంపేశారు' - వరకట్న వేధింపులు

'మహిళా సంఘాల్లో ఉండి నేను ఎంతోమంది ఆడపిల్లలకు న్యాయం చేశాను. కానీ నా బిడ్డను నేను కాపాడుకోలేకపోయాను. ఆ దుర్మార్గుడిని అరెస్ట్ చేసి.. జైలుకి, కోర్టుకు తీసుకెళ్లకండి. మహిళలంతా కలసి.. నా బిడ్డను ఎలా కొట్టి చంపాడో... అలాగే వాడిని చంపండి' వరకట్న వేధింపుల్లో కూతుర్ని కోల్పోయిన ఓ పెంచిన మేనత్త ఆవేదన ఇది.

married-women-death-cause-of-dowry-harassment-in-kamareddy
'వరకట్నం కోసం వేధించారు... చివరకు చంపేశారు'

By

Published : May 23, 2020, 12:06 PM IST

'వరకట్నం కోసం వేధించారు... చివరకు చంపేశారు'

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండంల కాళోజీవాడి గ్రామానికి చెందిన రజితకు... కామారెడ్డికి చెందిన శ్రీకాంత్​తో 2018లో వివాహం జరిపించారు. రజిత తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో... పెళ్లి తంతు మేనమామ జరిపించాడు. రెండెకరాల వ్యవసాయ భూమిని అమ్మి కట్నం ఇచ్చారు.

పెళ్లైన నెల రోజుల నుంచే అదనపు కట్నం కోసం శ్రీకాంత్ వేధించడం మొదలుపెట్టాడు. రజిత రాజంపేట మండలంలో నాబార్డు విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్​గా పని చేస్తుంది. పెళ్లైన నాటి నుంచి మధ్యలో 5 తులాల బంగారం కూడా ఇచ్చామని... నెల క్రితమే బైక్​ కోసం 80 వేల రూపాయలు కూడా శ్రీకాంత్​కు ఇచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు.

అయినా సరే వేధింపులు ఆగలేదని... గురువారం మళ్లీ అదనపు కట్నం కోసం... ఆడపడుచులు స్వప్న, లతలతో కలిసి తీవ్రంగా కొట్టాడని తెలిపారు. ఈ ఘటనలో రజిత తీవ్రగాయలపాలైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​కు తరలించగా... చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. భర్త, ఆడపడుచుల వేధింపుల వల్లనే రజిత మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

నిందితులను... అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లి తప్పు చేయకుండా... తన బిడ్డను చంపిన తరహాలోనే వాళ్లని చంపాలని... మేనత్త ఏడ్చిన తీరు అందరితో కంటతడి పెట్టించింది.

ఇవీ చూడండి:కరోనా నుంచి కోలుకున్న తర్వాత మెడనొప్పి!

ABOUT THE AUTHOR

...view details