తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్ధరామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న మార గంగారెడ్డి - సిద్ధరామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న మార గంగారెడ్డి వార్తలు

భిక్కనూర్‌లోని శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఆలయాన్ని మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ మార గంగారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

markfed chairman Mara Gangareddy visited the Siddarameshwara Temple
సిద్ధరామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న మార గంగారెడ్డి

By

Published : Mar 12, 2020, 3:04 PM IST

కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌లోని శ్రీ సిద్ధరామేశ్వర స్వామి వారి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య (మార్క్‌ఫెడ్‌) ఛైర్మన్‌ మార గంగారెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఘనంగా సన్మానించారు.

రైతులకు కనీస మద్దతు ధర అందించడమే ప్రభుత్వ ధ్యేయమని.. రైతులు పండించిన అన్ని పంటలను మార్క్‌ఫెడ్ కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని గంగారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని.. అన్ని వేళలా రైతులకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

సిద్ధరామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న మార గంగారెడ్డి

ఇవీ చూడండి:కనుమరుగైపోతున్న కళకు జీవం పోస్తున్నారు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details