తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్​ సోకిందనే అనుమానంతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య - నాగిరెడ్డిపేటలో చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

తనకు కరోనా సోకిందేమోననే అనుమానంతో తన పొలంలోని చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని బంజారాతండాలో జరిగింది. ఘటనాస్థలానికి చేరుకుని ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

man died in doubt of corona virus at kamareddy district
కొవిడ్​ సోకిందనే అనుమానంతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య

By

Published : Aug 20, 2020, 2:56 PM IST

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని బంజారాతండాకు చెందిన ఓ వ్యక్తి గత మూడు రోజలుగా బీపీ ఎక్కువై మతిస్థిమితం కోల్పోయిన వారిగా ప్రవర్తించాడు. కరోనా సోకిందేమోననే అనుమానంతో గురువారం తన పొలంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికుల సమాచారం మేరకు ఎస్సై రాజయ్య ఘటనాస్థలానికి చేరుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్​ సూచనలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details