ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రను ఆపాలని మహాదేవ్ మహారాజ్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడ్మెట్ పీఠాధిపతి మహాదేవ్ మహారాజ్ మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో పర్యటించారు. ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా శ్రీశైలంలో కుమార స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దెబ్బతీసేందుకు ఏపీ ప్రభుత్వం.. ఓ సంస్థ కుట్ర చేస్తుందన్నారు.
'ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా కుమార స్వామి ఆలయ నిర్మాణం'
ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా శ్రీశైలంలో కుమార స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మహాదేవ్ మహారాజ్ ఆరోపించాడు. శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దెబ్బతీసేందుకు ఏపీ ప్రభుత్వం.. ఓ సంస్థ కుట్ర చేస్తుందన్నారు.
'ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా కుమార స్వామి ఆలయ నిర్మాణం'
ప్రధాన ఆలయ సమీపంలో రూ.400 కోట్లతో 16 ఎకరాల్లో కుమారస్వామి ఆలయం నిర్మించడం తగదన్నారు. ఏపీ ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తెలుగు రాష్ట్రాల్లోని భక్తులందరికి తెలియజేస్తూ.. చైతన్యం తీసుకువస్తున్నామని తెలిపారు.