కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని నీల కంఠేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని రెండో రోజు దక్షయజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పూజారులు దండకాలు వేస్తూ అగ్నిగుండాల వైపు ముందుకు సాగారు.
అగ్ని గుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్న శైవభక్తులు - కామారెడ్డి జిల్లాలో శివరాత్రి జాతర
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో అగ్ని గుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్నారు శివ భక్తులు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షలు విరమించారు.
అగ్ని గుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్న శైవభక్తులు
అగ్ని గుండానికి ప్రత్యేక పూజలు చేశారు. పిల్లలు, పెద్దలతో పాటు అందరూ కలిసి అగ్ని గుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉపవాస దీక్షలను విరమించారు.