మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని.. కామారెడ్డి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. నియోజకవర్గంలోని మద్దికుంట బుగ్గా రామలింగేశ్వర ఆలయం, బిక్కనూర్ సిద్ధరామేశ్వర ఆలయం, దోమకొండ శివరామ ఆలయం, బండరామేశ్వర్ పల్లి రాజరాజేశ్వర ఆలయంలో.. వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
జిల్లాలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు - బుగ్గా రామలింగేశ్వర ఆలయం
జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు.
కామారెడ్డి జిల్లాలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
వేకువజాము నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. నీలకంఠుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల నిర్వాహకులు.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:కోరమీసాల మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ