కరోనా కేసుల ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 20 వరకు లాక్డౌన్ అమలు చేయాలని మహా ప్రభుత్వ నిర్ణయాల మేరకు అధికారులు అప్రమత్తం అయ్యారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలబత్పూర్-మహారాష్ట్ర సరిహద్దు వద్ద మహా పోలీసులు తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి.. లారీలను మినహాయించి మిగితా వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
ఆ చెక్పోస్ట్ నుంచి మహారాష్ట్రకు రాకపోకలు బంద్ - latest news of kamareddy
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మరికొన్ని కఠిన నిబంధనలు విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి లేని వాహనాల రాకపోకలను నిలిపివేసింది. ఫలితంగా కామారెడ్డి జిల్లాలోని మద్నూర్-మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఆ రాష్ట్ర పోలీసులు మద్నూర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి వేరే రాష్ట్ర, జిల్లాల ప్రజలను తమ ప్రాంతంలోనికి రావొద్దంటూ అడ్డుకుంటున్నారు.
![ఆ చెక్పోస్ట్ నుంచి మహారాష్ట్రకు రాకపోకలు బంద్ madnur boarder closed by maharastra police at kamareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8018019-248-8018019-1594711599389.jpg)
మద్నూర్- మహారాష్ట్ర సరిహద్దు బంద్
ఇతర రాష్ట్రాల నుంచి ఏ ఒక్కరిని కూడా తమ జిల్లాలోకి అనుమతించబోమని పేర్కొంటున్నారు. అత్యవసరం అయితే తప్ప మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ సరిహద్దు మండలాల ప్రజలు మహారాష్ట్ర డేగ్లూర్ పట్టణంలోకి రావొద్దని సూచిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల వాసులు దేగ్లూర్కి కాలిబాటన వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇదీ చూడండి:బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్ఫోన్ కానుక