జమ్మూకశ్మీర్లో నిర్వహించిన జాతీయ స్థాయిల క్రీడల్లో మద్నూర్ డిగ్రీ కళాశాల విద్యార్థి ప్రతిభను చాటింది. కామారెడ్డి జిల్లాకు చెందిన తుమ్మల్వార్ లక్ష్మి ప్రపంచ గ్రామీణ క్రీడల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో పాల్గొంది.
జాతీయ స్థాయి క్రీడల్లో తెలుగు విద్యార్థికి స్వర్ణం - World Rural Sports Federation
జాతీయ స్థాయి క్రీడల్లో మద్నూర్ డిగ్రీ కళాశాల విద్యార్థి ప్రతిభ చాటింది. జమ్మూకశ్మీర్లో ప్రపంచ గ్రామీణ క్రీడల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో బంగారు పతకం సాధించింది.
తెలుగు విద్యార్థికి స్వర్ణం
ఈ క్రీడల్లో అండర్ -17 విభాగం నుంచి 200 మీటర్ల పరుగును 40 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించింది. బాలికను కళాశాల యాజమాన్యం సన్మానించింది. మారుమూల ప్రాంతంలో పుట్టి జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించడం తమ గ్రామానికి గర్వకారణమని గ్రామస్థులు కొనియాడారు. భవిష్యత్తులో అంతర్జాతీయ పోటీలకు అవసరమయ్యే ఆర్థిక సహాయం అందచేయనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ గిరిరాజ్ తెలిపారు.
ఇదీ చదవండి:'ఫాస్టాగ్'లో లొసుగులు- మోసగాళ్లకు కాసులు