తెలంగాణ

telangana

ETV Bharat / state

double bed rooms: విల్లాలను తలపిస్తున్న రెండు పడక గదుల ఇళ్లు - కామారెడ్డి జిల్లా లేటెస్ట్​ వార్తలు

చూడగానే అబ్బురపరిచే ఇళ్లు.. అందమైన డిజైన్లు.. అధునాతన వసతులు... హాయినిచ్చే పచ్చని చెట్లు.. విశాలమైన రోడ్లు... ఇవన్నీ వింటుంటే కచ్చితంగా గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు గుర్తొస్తాయి. ఆ విల్లాలను తలపించేలా కామారెడ్డి జిల్లాలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు(double bed rooms) అందరినీ ఆకర్షిస్తున్నాయి. దేశానికి బెంచ్ మార్క్‌లా ఉన్నాయంటూ మంత్రి కేటీఆర్​ ట్వీట్ చేయడంతో ఈ ఇళ్లు వార్తల్లో నిలిచాయి.

luxury double luxury double bed roomsbed rooms
రెండు పడక గదుల ఇళ్లు

By

Published : Jun 20, 2021, 3:25 AM IST

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లిలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు(double bed rooms) అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జాతీయ రహదారి 44 ఆనుకొని నిర్మించిన ఈ నిర్మాణాలను చూసి అందరూ విల్లాలు అని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్​ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఇవి వార్తల్లో నిలిచాయి. జంగంపల్లికి మంజూరైన 50 రెండు పడక గదుల ఇళ్లను ఎమ్మెల్యే గంప గోవర్ధన్... బిల్డర్‌ సుభాష్ రెడ్డికి అప్పగించారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ నిధులకు... తన నిధులు కలిపి నిర్మించినట్లు బిల్డర్‌ సుభాష్ రెడ్డి తెలిపారు.

అన్ని సౌకర్యాలు

గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే సౌకర్యాలే జంగంపల్లిలో ఉండాలని అదనంగా ఖర్చు చేసి నిర్మించారు. రెండు అంతస్తుల చొప్పున ఒక్కో బ్లాక్‌లో 8 ఇళ్లు ఉండేలా... ఆరు బ్లాకులుగా కట్టారు. విద్యుత్, డ్రైనేజీ... రెండూ అండర్ గ్రౌండ్‌లో నిర్మించారు. ప్రతి ఇంటికీ టైల్స్, వంట గదిలో మార్బుల్స్ వేయించారు. ఆటో లాక్ సిస్టం ఉండే తలుపులు... యూపీవీసీ కిటికీలు బిగించారు. ఫ్యాన్లు, లైట్లు కూడా గుత్తేదారే అమర్చారు. ప్రతి ఇంటికీ ప్రత్యేకంగా ఎలివేషన్ ఇవ్వడంతో విల్లాలుగా కనిపిస్తున్నాయి. ప్రతి ఇంటి చుట్టూ సీసీ రోడ్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి చుట్టూ కడియం నుంచి తెప్పించిన చెట్లు... అన్ని ఇళ్లకు సరిపడేలా నీటి సంపుతో పాటు ప్రతి ఫ్లోర్‌కూ నీటి ట్యాంకు ఏర్పాటు చేశారు.

ఒక్కో ఇంటికి 8లక్షలు ఖర్చు

సాధారణంగా ప్రభుత్వం ఒక్కో ఇంటికి 5లక్షలు ఇస్తుంది. అయితే జంగంపల్లిలో నిర్మించిన ఒక్కో ఇంటికి 8లక్షల వరకు ఖర్చయిందని అధికారులు చెబుతున్నారు. ఈ అదనపు ఖర్చును గుత్తేదారు సుభాష్ రెడ్డి ఇచ్చినట్లు తెలిపారు. నిర్మాణం ప్రారంభం నుంచి పూర్తయ్యేదాకా ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెబుతున్నారు. అధునాతన విల్లాలను తలపించే ఇళ్లు తమకు ఇస్తుండటం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

ఇదీ చదవండి:cabinet: కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details