లాక్‌డౌన్ వల్ల కామారెడ్డి జిల్లాలో దుకాణాలు, చిన్నతరహా, కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. పేదల బతుకు ఛిద్రమైంది. ప్రభుత్వం ఆయా వర్గాలకు ఊరట కలిగించేలా పల్లెల్లో పనులు చేసుకొనేందుకు సడలింపులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గృహ నిర్మాణ కూలీలు, బీడీ కార్మికులతో పాటు చిరువ్యాపారులకు వెసులు బాటు లభించనుంది.
కలిగే ప్రయోజనాలు...
- బీడీ కార్ఖానాలు మూసివేయడం వల్ల ఉపాధి కోల్పోయిన మహిళలకు తాజా సడలింపులతో ఊరట కలగనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు రెండున్నర లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.
- భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఈ పనుల్లో పాల్గొనే కార్మికులకు ఉపాధి లభించనుంది.
- ఎలక్ట్రీషియన్లు, రిపేర్లు, మోటారు మెకానిక్‌లు, వడ్రంగి సేవలకు అనుమతి ఇవ్వడం వల్ల జిల్లాలో సుమారు ఐదువేల మందికి పని లభించనుంది.
- గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి ఇవ్వడం వల్ల ఆయా పనులు ఊపందుకోనున్నాయి.
- వానాకాలం సీజన్ సమీపిస్తుండటంతో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలు తెరిచి ఉంచుతారు. ఫలితంగా రైతుల రాకపోకలకు ఆయా పనులు చేసేకునేందుకు అవకాశం లభించనుంది.
- ఇటుక బట్టీలు, ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో నిర్మాణ పనులు ఊపందుకోవడం వల్ల వందలాది మంది కూలీలకు ఉపాధి లభించే అవకాశాలున్నాయి.
- మద్నూర్ మండల కేంద్రంలో లాక్‌డౌన్ ప్రారంభమైన నాటి నుంచి జిన్నింగ్‌మిల్లుల్లో పనులు నిలిపివేశారు. తిరిగి జిన్నింగ్ మిల్లుల్లో పనులు ప్రారంభంకానున్నాయి. సుమారు ఐదు వందల నుంచి వెయ్యి మంది కూలీలకు ఉపాధి లభించనుంది.
సడలింపులు వీటికే...