కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోశంపూర్ గ్రామ సొసైటీ పరిధిలో దాదాపు ఐదు గ్రామాల రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. వీరికి సుమారుగా నాలుగున్నర వేల బస్తాల యూరియా అవసరముండగా.. సోమవారం సొసైటీకి కేవలం 450 బస్తాలు అందుబాటులోకి వచ్చింది. వాటికి తీసుకునేందుకు అన్నదాతల కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. ఉదయం 6 గంటల నుంచే చెప్పులను ఉంచి క్యూ కట్టారు.
మోశంపూర్లో యూరియా కోసం బారులు తీరిన రైతులు - less urea distribution to farmers in telangana
తెలంగాణలో యూరియా కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మోశంపూర్ సొసైటీ పరిధిలో యూరియా కోసం దాదాపు ఐదు గ్రామాల ప్రజలు గంటల తరబడి నిలబడ్డారు. ఇంత ఎదురుచూసినా.. సరిపడా యూరియా ఇవ్వక.. ఒక బస్తా ఇచ్చి సాగనంపుతున్నారు.

మోశంపూర్లో యారియా కోసం బారులు తీరిన రైతులు
యూరియా కోసం మోశంపూర్ సొసైటీ పరిధిలోని రైతులే కాకుండా వేరే గ్రామాల అన్నదాతలు వచ్చి ఎదురుచూశారు. ఉదయం ఒక్కో రైతుకు రెండేసి బస్తాలు ఇస్తామన చెప్పిన అధికారులు.. ఒక్క బస్తానే ఇచ్చారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరికైతే.. అవీ రాలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని కోరుతున్నారు.
TAGGED:
తెలంగాణలో యూరియా కొరత