కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లిలో చిరుత సంచారం.. గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామశివారును ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తూ జంతువులపై దాడి చేసి.. వాటిని చంపి తింటోంది. ఇటీవల మేతకు వెళ్లిన 3 మేకలు, ఒక గొర్రెను చంపిందని గ్రామస్థులు తెలిపారు.
జంతువులపై చిరుత దాడి.. పట్టించుకోని అధికారులు - leopard wandering in ellareddypally
కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఎల్లారెడ్డిపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన మేకలు, గొర్రెలపై దాడి చేసింది.
![జంతువులపై చిరుత దాడి.. పట్టించుకోని అధికారులు leopard wandering in kamareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11362519-998-11362519-1618126236108.jpg)
ఎల్లారెడ్డిపల్లిలో చిరుత కలకలం
ఈ మేరకు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మృతి చెందిన వాటికి పంచనామా నిర్వహించిన అధికారులు.. చిరుతపులిని పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:పోలీసుల కరోనా డ్రైవ్.. మాస్కు లేనివారికి వెయ్యి ఫైన్