తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్రహ్మణపల్లిలో చిరుత సంచారం - Leopard latest news

ఈ మధ్య కాలంలో చిరుతలు అడివి దాటి వస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లిలో చిరుత సంచారం గ్రామస్థుల్లో ఆందోళన కలిగిస్తోంది.

Leopard wandering at bramhanapally in kamareddy district
బ్రహ్మణపల్లిలో చిరుత సంచారం

By

Published : Sep 4, 2020, 7:49 PM IST

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లిలో చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. గురువారం గ్రామానికి చెందిన బాలయ్య అనే రైతు మొక్కజొన్న పంట చూసేందుకు వెళ్లేసరికి చిరుత కుందేలును చంపిన ఆనవాళ్లు కనిపించాయి.

బాలయ్య వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు అక్కడికి చేరుకుని కుందేలు మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించగా చిరుత పులి కాలి ముద్రలను చూసి ఆ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని నిర్ధరణకు వచ్చారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వటంతో నిన్న సాయంత్రం బోనును ఏర్పాటు చేశారు. రైతులు జాగ్రత్త గా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి:రష్యా వేదికగా రక్షణ మంత్రుల భేటీకి చైనా పిలుపు!

ABOUT THE AUTHOR

...view details