కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో చిరుత సంచారం - కామారెడ్డి జిల్లా లేటెస్ట్ వార్తలు
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో చిరుత సంచారం
03:52 November 25
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో చిరుత సంచారం
కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు చిరుత కనిపించినట్లు చెబుతున్నారు. గ్రామాల ప్రజల ఫిర్యాదుతో అటవీ శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షించారు.
బోను ఏర్పాటుచేసి చిరుత కోసం గాలింపు చేపట్టారు. చిరుత ఎప్పుడు ఎవరిపైన దాడి చేస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Nov 25, 2020, 4:34 AM IST