కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని సీతాయిపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం పశువుల కాపరులకు చెట్టుపై చిరుత కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన కాపరులు తిరిగి గ్రామానికి వెనుదిరిగారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడం వల్ల ఎఫ్ఆర్వో చంద్రకాంత్ రెడ్డి తన సిబ్బందితో ఆ ప్రాంతంలో గాలించారు. అక్కడ చెట్టుపై చిరుత గాట్లను గుర్తించారు. సమీపంలోనే దాని మలం ఉన్నట్లు తెలిపారు. తరచూ ఇదే ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు ఎఫ్ఆర్వో పేర్కొన్నారు. గ్రామస్థులు, పశువుల కాపరులు ఎవరూ ఇటు వైపు రాకూడదని తెలిపారు.
కామారెడ్డి జిల్లా సీతాయిపల్లిలో చిరుత కలకలం
కామారెడ్డి జిల్లా సీతాయిపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత కలకలం రేపింది. పశువుల కాపరులకు చిరుత కనిపించటంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఆ ప్రాంతంలో పరిశీలించి ఎవరూ అటు వైపు రాకూడదని తెలిపారు.
కామారెడ్డి జిల్లా సీతాయిపల్లిలో చిరుత కలకలం