కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నియోజవర్గస్థాయి అంబేడ్కర్ భవన నిర్మాణం కోసం స్థలాన్ని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం ఏన్నో సంక్షేమ పథకాలను అమలు పరిచిందన్నారు.
అన్నీ కులాల వారికి కమ్యూనిటీ హాల్‌ను నిర్మించామని తెలిపారు. కోటి రూపాయలతో నియోజవర్గస్థాయి అంబేడ్కర్ భవనం నిర్మిస్తామని స్పీకర్ పేర్కొన్నారు.