కామారెడ్డిలోని గంజ్గెట్ సమీపంలో దారుణ హత్య జరిగింది. హమాలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తొఫీద్(28)ను గుర్తుతెలియని దుండగులు తలపై బండరాయితో మోది హత్య చేశారు. బతుకమ్మ కుంటకు చెందిన తొఫీద్.. తండ్రి మునీర్‌తో కలిసి ఉంటున్నాడు. అతని తల్లి ఇటీవలే మరణించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తెల్లవారుజామున హత్య జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డిలో హమాలీ దారుణ హత్య - CRIME NEWS IN TELANGANA
రోజూ హమాలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ కూలీ తెల్లవారుజామున రక్తపుమడుగులో విగతజీవిగా కన్పించాడు. గుర్తుతెలియని దుండగులు తలపై బండరాయితో మోది హత్య చేశారు. ఈ ఘటన కామారెడ్డిలో జరిగింది.
![కామారెడ్డిలో హమాలీ దారుణ హత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5108445-thumbnail-3x2-ppp.jpg)
LABOUR BRUTALLY MURDERED IN KAMAREDDY