తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి ఉత్సవాలు - ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి ఉత్సవాలు

కామారెడ్డి జల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ  104వ జయంతి  వేడుకలను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి ఉత్సవాలు

By

Published : Sep 27, 2019, 4:43 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కృషి చేసిన వారందరికీ కొండా లక్ష్మణ్ తోడుగా నిలిచారని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ అన్నారు. బాపూజీ కృషి ఎనలేనిదని.. అలాంటి గొప్ప వ్యక్తి జయంతి జరపడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ పాటలు పాడి, బతుకమ్మ ఆటలు ఆడిన విద్యార్థినీ విద్యార్థులకు కలెక్టర్ సత్యనారాయణ బహుమతులు అందించారు.

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details