ప్రజా ప్రతినిధుల ఏకపక్ష నిర్ణయాలపై ఆగ్రహిస్తూ... ముగ్గురు వ్యక్తులు కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. మండల పరిషత్ పరిధిలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. తెరాస, కాంగ్రెస్‌లు చెరో 3 స్థానాలు, భాజపా2, స్వతంత్రులు 2 స్థానాల్లో గెలిచారు.
మమ్మల్ని అడగకుండా.. నిర్ణయం తీసుకుంటారా? - రవీందర్
మమ్మల్ని అడగకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటారా..? అంటూ కామారెడ్డి జిల్లాలో ముగ్గురు వ్యక్తులు నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.
నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన
ఎంపీపీ ఎన్నిక కోసం స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రవీందర్ తెరాసకు మద్దతివ్వడంపై కన్నాపూర్ గ్రామస్థులకు ఆగ్రహం తెప్పించింది. తమను కనీసం సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ సదాశివనగర్‌లోని నీటి ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.
ఇవీ చూడండి: తెలుగుదేశం ఖాతాలో ఏన్కూరు మండల పరిషత్