Kamareddy, Telangana Elections Result 2023 Live : తెలంగాణ ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న కామారెడ్డి నియోజకవర్గంలో మొదటి నుంచి రేవంత్ రెడ్డి హవా సాగింది. దాదాపుగా కేసీఆర్‌పై (KCR) రేవంత్ గెలుపు ఖాయం అనుకుంటున్న తరుణంలో.. అకస్మాత్తుగాబీజేపీ (BJP) అభ్యర్థి వెంకటరమణ రెడ్డి ముందంజలోకి దూసుకొచ్చారు. ప్రస్తుతం ఆయనే ఆధిక్యం కొనసాగిస్తున్నారు. 13వ రౌండ్ నుంచి అధిక్యంలో ఉన్న వెంకటరమణ అన్ని రౌండ్లు పూర్తయ్యే సరికి 5వేల ఓట్ల మెజారిటీతో విజయ కేతనం ఎగురవేశారు.
Kamareddy Election Result 2023 Live : కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. 5,810 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 65,198 ఓట్లు రాగా ఓట్లు రాగాబీఆర్ఎస్ అభ్యర్థి సీఎం కేసీఆర్‌కు 59,388 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి 54,296 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 5,810 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఆధిత్యం ఆద్యంతం చేతులు మారుతూ వచ్చినా చివరకు రమణారెడ్డిని విజయం వరించింది.
BJP Won Kamareddy Constituency : కామారెడ్డి నియోజకవర్గ కౌంటింగ్ అభ్యంతం ఆసక్తిని కలిగించింది. ప్రముఖులు పోటీ చేయడం ఒక ఎత్తు అయితే రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం చేతులు మారడంతో ఉత్కంఠను రేపింది. కౌంటింగ్ ప్రారంభంలో మొదటి మూడు రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యం కనబరచగా... 5, 6, 9, 16 రౌండ్లలో బీఆర్ఎస్ అధిక్యతను కనబరిచింది. మిగిలిన 11 రౌండ్లలో బీజేపీ స్పష్టమైన మెజార్టీని సాధించింది. నియోజకవర్గంలో మాచారెడ్డి దోమకొండ బీబీపేట కామారెడ్డి పట్టణం కామారెడ్డి గ్రామీణం మండలాలు ఉన్నాయి.
కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో సమానంగా ఓట్లు సాధిస్తూ వచ్చిన రమణారెడ్డి భిక్కనూరు కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత క్రమంగా ఆధిక్యతను పెంచుకుంటూ వచ్చారు. కామారెడ్డి పట్టణంలో కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత స్పష్టమైన ఆధిక్యతను చూపించారు. ప్రతి రౌండ్‌కు ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లిన రమణారెడ్డి చివరికి ఉత్కంఠ భరితమైన పోరులో విజయం సాధించారు.