తెలంగాణ

telangana

ETV Bharat / state

క్షణాల్లోనే జరిమానా చలానా సిద్ధం - కామారెడ్డి జిల్లా

అతి వేగం వల్ల జాతీయ రహదారి-44 పై వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటి నియంత్రణకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్రముఖ నగరాలకే పరిమితమైన స్పీడ్‌ లేజర్‌ గన్లను ఉభయ జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చి వేగంగా వెళ్లే వాహనాలకు కళ్లెం వేయాలని భావిస్తున్నారు.

క్షణాల్లోనే జరిమానా చలానా సిద్ధం

By

Published : Jul 7, 2019, 12:11 PM IST

Updated : Jul 7, 2019, 12:28 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జాతీయ రహదారిపై కుప్రియాల్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ జిల్లా పరిధిలో డిచ్‌పల్లి బీబీపూర్‌తో పాటు డిచ్‌పల్లి-ఆర్మూర్‌ మధ్యలో, ఆర్మూర్‌-సోన్‌ వంతెన మధ్యలో మూడు స్పీడ్‌ లేజర్‌ గన్లు ఏర్పాటు చేశారు. ఏవైనా కొన్ని నిర్దేశిత రోడ్లపై స్పీడ్‌ లేజర్‌ గన్లను ఏర్పాటు చేస్తే అవి చడీచప్పుడు కాకుండా వాటి పనిని పూర్తిచేస్తాయి. ఆ రోడ్డు మీదుగా వెళ్లే ప్రతి వాహనం వేగాన్ని నమోదు చేస్తాయి. స్పీడ్‌గన్‌ విషయం గ్రహించిన వాహనదారులు వేగంగా వెళ్లేందుకు వెనుకడుగు వేస్తారు. తద్వారా ప్రమాదాలను నియంత్రించొచ్చు.

క్షణాల్లోనే జరిమానా చలానా సిద్ధం

వేగంపై కన్ను
వేగపరిమితిని దాటి ఏ వాహనం వెళ్లినా ఫొటో తీస్తుంది. వాహన నంబరు, ప్రయాణించిన వేగం తదితర వివరాలను హైదరాబాద్‌లోని సర్వర్‌కు చేరవేస్తుంది. క్షణాల్లోనే జరిమానా చలానా సిద్ధమవుతుంది. ఆపై వాహన యజమాని చరవాణికి సందేశం అందుతుంది. ఇదంతా వాహనం 200 మీటర్ల దూరం వెళ్లేలోపు జరిగిపోతుంది. వేగ పరిమితి దాటితే కనీసం రూ.వెయ్యి చొప్పున జరిమానా చెల్లించాల్సి వస్తుంది. వేగం ఎంత ఎక్కువుంటే అపరాధ రుసుము అంత పెరిగే అవకాశముంది.

ఇదీ చూడండి : నేటి నుంచి ఎంబీబీఎస్​, బీడీఎస్​ వెబ్​ కౌన్సెలింగ్

Last Updated : Jul 7, 2019, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details