గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి పెద్దచెరువు మత్తడి దూకుతున్నది. చెరువు నిండడం వల్ల మత్స్యకారులు చేపలు పట్టడానికి పోటీ పడుతున్నారు. దాదాపు 2వేల ఎకరాల ఆయకట్టుకు ఈ చెరువు ద్వారా సాగునీరు అందుతున్నది. కామారెడ్డి పెద్ద చెరువు నిండితే.. దాదాపు చుట్టుపక్కల పది గ్రామాలకు భూగర్భ జలాలు అందుతాయి. పెద్ద చెరువు ద్వారా కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగు నీరు కూడా అందుతున్నది. చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతుండడం వల్ల పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మత్తడి దూకుతున్న కామారెడ్డి చెరువు! - అలుగు పారుతున్న చెరువులు
గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి చెరువు నిండి.. మత్తడి దూకుతోంది. అలుగు పారుతున్న .. చేపలు పట్టడానికి మత్స్యకారులు పోటీ పడుతున్నారు. చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతుండడం వల్ల పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మత్తడి దుంకుతున్న కామారెడ్డి చెరువు!