తెలంగాణ

telangana

ETV Bharat / state

'మాస్టర్ ప్లాన్' రగడ.. కామారెడ్డి కలెక్టరేట్‌ వద్ద మరోసారి ఉద్రిక్తత - Kamareddy farmers protest

Kamareddy Municipal Master Plan Issue : కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్ రగడ కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా దశల వారీగా వివిధ రూపాల్లో బాధిత రైతులు నిరసన తెలుపుతున్నారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తన భూమి కోల్పోతానని భయపడి బుధవారం రోజున ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడటంతో రైతులు ఆందోళనకు దిగారు. మరోసారి కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Etv Bharat
Etv Bharat

By

Published : Jan 5, 2023, 12:18 PM IST

Updated : Jan 5, 2023, 3:23 PM IST

కామారెడ్డిలో మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రగడ

Kamareddy Municipal Master Plan Issue :కామారెడ్డి మున్సిపల్‌ మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాటపట్టారు. రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో బాధిత రైతులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అడ్లూరు ఎల్లారెడ్డి, ఇల్చిపూర్, లింగాపూర్ గ్రామాల రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 8 గ్రామాల మీదుగా ప్రతిపాదించిన 100 ఫీట్ల రోడ్డు తమకొద్దంటూ ఈ సందర్భంగా రైతులు నినదించారు. ఇప్పటికే ఈ ప్లాన్ వల్ల తాను భూమి కోల్పోతాననే భయంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Kamareddy Municipal Master Plan dispute : గ్రీన్ జోన్‌, ఇండస్ట్రీయల్‌ జోన్‌ పేరుతో తరతరాలుగా సాగుచేసుకుంటున్న పచ్చని పంటపొలాల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే సహించబోమని బాధిత రైతులు స్పష్టం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండానే అధికారులు ఏకపక్షంగా భూసేకరణ అంచనాలు రూపొందించారని ఆరోపించారు. తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను కాపాడుకునేందుకు తెగించి పోరాడుతామని చెప్పారు. బాధిత గ్రామాల్లో ఒకటైన అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ సర్పంచ్ భర్తను కామారెడ్డి రైల్వేస్టేషన్ చౌరస్తాలో రైతులు నిలదీశారు.

కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. కామారెడ్డి కలెక్టరేట్‌ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కలెక్టరేట్‌ వద్ద రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కామారెడ్డి కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు రైతుల యత్నించారు. ఈ క్రమంలో కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు తొలగించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కామారెడ్డి కలెక్టర్‌ ముందు రైతులు బైఠాయించారు. రైతులతో కలిసి ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా ధర్నాలో పాల్గొన్నారు.

అసెంబ్లీ నిర్వహించడం లేదు.. కామారెడ్డి రైతుల ఆందోళనకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మద్దతు తెలిపారు. కర్షకులతో పాటు కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. వ్యవసాయానికి పనికిరాని భూములనే పరిశ్రమలకు కేటాయించాలని రఘునందన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతుల భూములను పారిశ్రామిక వాడ నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు మాట్లాడదామంటే అసెంబ్లీ నిర్వహించడం లేదని ఆరోపించారు.

అసలు ఈ మాస్టర్ ప్లాన్ గొడవ ఏంటంటే..?రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ బృహత్‌ ప్రణాళికను దిల్లీకి చెందిన ఓ సంస్థతో ఇటీవల తయారు చేయించారు. కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, టెకిర్యాల్ , కాల్సిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లిని కలుపుకుని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేశారు. మొత్తం పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించి.. ఆ వివరాలను ఈ మధ్యే ప్రకటించారు.

2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు చెప్పారు. పారిశ్రామిక జోన్ కోసం 1200 ఎకరాలతో 8.5 శాతం ప్రతిపాదించారు. ఇందులో నేషనల్ హైవే పక్కన పచ్చని పంటలు పండే.. అడ్లూర్, ఇల్సిపూర్, టెకిర్యాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి రైతులకు చెందిన 900 ఎకరాల భూములను చూపారు. దీనివల్ల ఈ భూములు రెసిడెన్షియల్ కింద పనికిరావని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఈ భూములకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. భవిష్యత్‌లో ఇళ్ల నిర్మాణం కూడా కష్టమవుతుందని భావించిన రైతులు ఆందోళనబాట పట్టారు.

కామారెడ్డి మున్సిపల్‌ మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాటపట్టారు. రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో బాధిత రైతులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. 8 గ్రామాల మీదుగా ప్రతిపాదించిన 100 ఫీట్ల రోడ్డు తమకొద్దంటూ ఈ సందర్భంగా రైతులు నినదించారు. గ్రీన్ జోన్‌, ఇండస్ట్రీయల్‌ జోన్‌ పేరుతో తరతరాలుగా సాగుచేసుకుంటున్న పచ్చని పంటపొలాల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే సహించబోమని స్పష్టం చేశారు. రైతులకు సమాచారం ఇవ్వకుండానే అధికారులు ఏకపక్షంగా భూసేకరణ అంచనాలు రూపొందించారని ఆరోపించారు. తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను కాపాడుకునేందుకు తెగించి పోరాడుతామని రైతులు స్పష్టం చేశారు. బాధిత గ్రామాల్లో ఒకటైన అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ సర్పంచ్ భర్తను కామారెడ్డి రైల్వేస్టేషన్ చౌరస్తాలో రైతులు నిలదీశారు.

"చాలా రోజుల నుంచి మేం గ్రీన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, 100 ఫీట్ల జోన్‌లు వద్దని చెబుతున్నాం. మా ప్రాణాలైనా ఇస్తాం కానీ అధికారులు అనుకుంది మాత్రం జరగనివ్వం. అధికారుల ప్లాన్ వల్ల మేం ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములు కోల్పోతున్నాం. రైతుల పొట్టకొట్టి వారి భూములను ఇండస్ట్రలియ్ ఏరియాలో చూపించడం దారుణం. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్ సర్కార్ కర్షకులకు అన్యాయం చేస్తోంది. " - బాధిత రైతులు

Last Updated : Jan 5, 2023, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details