తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డిలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే - kalyana lakshmi cheques distribution in kamareddy

కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన నివాసం వద్ద అర్హులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.

kamareddy mla
కామారెడ్డి ఎమ్మెల్యే

By

Published : Mar 13, 2021, 7:57 PM IST

కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తన నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని 28 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తన నివాసం వద్ద చెక్కులు పంపిణీ చేశారు. తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 3,545 మందికి రూ. 35 కోట్ల 09 లక్షల 78 వేల 900 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిందని తెలిపారు.

కామారెడ్డి ఎమ్మెల్యే

అనంతరం దోమకొండ మండలంలోని అంచనూర్​లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఇదీ చదవండి:రవాణాశాఖలో ఆన్​లైన్​లోకి మరో 17 సేవలు

ABOUT THE AUTHOR

...view details