తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం.. కౌన్సిల్‌లో తీర్మానానికి రైతుల డిమాండ్ - Kamareddy master plan dispute updates

Kamareddy Master Plan Issue Updates: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం అన్నదాతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కామారెడ్డి మున్సిపాలిటీ ఎదుట నిరసన చేపట్టారు. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు.

Kamareddy Master Plan Issue Updates
Kamareddy Master Plan Issue Updates

By

Published : Jan 11, 2023, 10:24 AM IST

Updated : Jan 11, 2023, 12:24 PM IST

Kamareddy Master Plan Issue Updates: కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రైతుల నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు కామారెడ్డి పురపాలక కార్యాలయం ఎదుట అన్నదాతలు ధర్నా నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అంతకు ముందు రైతుల ధర్నా నేపథ్యంలో పొలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. కామారెడ్డి పట్టణంలోని పలువురు బీజేపీ కార్యకర్తలను.. విలీన గ్రామాల్లో రైతు ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు.

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. మాస్టర్‌ప్లాన్‌ ప్రతిపాదనలపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని ఏజీ.. ధర్మాసనానికి తెలిపారు. మాస్టర్‌ ప్లాన్‌పై స్టేటస్‌కో ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 25కు వాయిదా వేసింది.

Last Updated : Jan 11, 2023, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details