Kodangal, Telangana Election Result 2023 LIVE :తెలంగాణ ఎన్నికల కౌంటింగ్లో కాంగ్రెస్(Congress Party) హవా నడిచింది. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొండగల్ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. 31,849 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డిపై గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో నిలిచిన రేవంత్‌రెడ్డి ఆ ఎన్నికల్లో పట్నం నరేందర్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీకి జోష్ తీసుకొచ్చి - అన్నీ తానై వన్ మ్యాన్ ఆర్మీ షో
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి(Revanth reddy) అపజయం పాలయ్యారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. సీఎం కేసీఆర్ రెండో స్థానంలో నిలవగా రేవంత్‌రెడ్డి మూడోస్థానానికి పరిమితమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఓటమి చవిచూసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈసారి మెజార్టీ ఓట్లతో విజయం సాధించారు.
Revanthreddy take Oath as CM Tommorrow :రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది. రేపు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారోత్సవానికి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ముగ్గురు కమిషనర్లకు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఆదేశాలు జారీ చేశారు. రేపు జరగబోయే ప్రమాణా స్వీకారానికి సోనియా, రాహుల్, ప్రియాంక వచ్చే అవకాశం ఉంది.