తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డెక్కిన అన్నదాత... తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన

అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్​ మండలం దుర్కి గ్రామరైతులు ఆందోళనకు దిగారు. బాన్సువాడ-బోధన్​ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

కామారెడ్డిలో రైతుల ధర్నా

By

Published : Nov 3, 2019, 8:14 PM IST

Updated : Nov 3, 2019, 8:21 PM IST

కామారెడ్డిలో రైతుల ధర్నా

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్​ మండలం దుర్కి గ్రామరైతులు బాన్సువాడ - బోధన్​ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వర్షానికి తడిసిన ధాన్యం, తేమశాతం 22 వరకు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

అకాలవర్షం వల్ల భారీగా పంటనష్టం జరిగిందని, ఇప్పటివరకు సంబంధిత శాఖ అధికారులు పంట పరిశీలన చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు పరిశీలించి రైతులకు పరిహారం అందేలా చూడాలని అధికారులను కోరారు.

సుమారు గంటపాటు సాగిన ధర్నాతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమస్య పరిష్కరించేంత వరకూ ఆందోళన విరమించేదిలేదని రైతులు పట్టుబట్టగా పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆర్డీవో రాజేశ్వర్​తో ఫోన్​లో మాట్లాడించి, సమస్య పరిష్కరిస్తామి డీఎస్పీ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

Last Updated : Nov 3, 2019, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details